KDP: మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని భూమాయపల్లి వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు పసల వెంకటయ్య (50) అక్కడికక్కడే మృతి చెందారు. స్వగ్రామం పప్పనపల్లె నుంచి విధులకు మైదుకూరు వస్తుండగా సుమారు 4.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఘోర రోడ్డు ప్రమాదం.. కార్మికుడు మృతి


