హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెడ్ క్రాస్ ప్రతినిధులతో కలెక్టర్ భేటీ

నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ పాలకవర్గ సభ్యులు కలెక్టర్ హిమాన్షు శుక్లాను మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాలో నిర్వహిస్తున్న రక్త దాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు, ప్రకృతి విపత్తుల సమయంలో అందిస్తున్న సహాయక చర్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రెడ్ క్రాస్ సేవలను అభినందించారు. భవిష్యత్‌లో జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.