హైదరాబాద్: 28°C
వ్యాపారం

నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉ.9.17 గంటల సమయంలో BSE సెన్సెక్స్‌ 116 పాయింట్లు నష్టపోగా, NSE నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో ప్రతికూలంగా ట్రేడ్ అవుతోంది. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే మన రూపాయి మారకం విలువ ఒక పైసా మేర క్షీణించింది. ప్రారంభం నుంచే సూచీలు నీరసించడంతో మదుపర్లు అమ్మకాల వైపు మొగ్గుచూపుతున్నారు.