హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసుల కార్డాన్ సెర్చ్.. 60 బైక్‌లు స్వాధీనం

PLD: చిలకలూరిపేట తూర్పు దళితవాడలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. 100 మంది పోలీసులతో తనిఖీలు చేపట్టి, సరైన పత్రాలు లేని 60 బైక్‌లు, 4 ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.