హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీచ్ రోడ్‌లో 300 మంది డాక్టర్ల ర్యాలీ

VSP: విశాఖ బీచ్ రోడ్‌లో జూనియర్ డాక్టర్లు పదో రోజు నిరసన కొనసాగించారు. బుధవారం ఉదయం కాళీమాత టెంపుల్ నుంచి బీచ్ రోడ్ వరకు 300 మంది డాక్టర్లతో ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. స్టైఫండ్ పెంచాలని కోరినా ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.