హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెలుగొండలో మౌలిక వసతులపై కలెక్టర్ దృష్టి

ప్రకాశం: మార్కాపురం జిల్లా పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల పనులపై జిల్లా కలెక్టర్ విజయసునీత ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం జేసి శ్రీనివాసులతో కలిసి వివిధ పునరావాస లే-అవుట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్దేశిత గడువులోగా అన్ని మౌలిక వసతుల పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.