SRD: సింగూర్ ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం ఉదయానికి నీటిమట్టం 515.360 మీటర్లకు చేరింది. 29.917 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 4.430 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి సగటున 611 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో, దిగువకు 380 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి నీటిమట్టం 523.600 మీటర్లు.
తెలంగాణ
సింగూర్ ప్రాజెక్టుకు 611 క్యూసెక్కుల ఇన్ ఫ్లో


