హైదరాబాద్: 28°C
తెలంగాణ

'CHCలో పూర్తిస్థాయి వైద్య సదుపాయాలు కల్పించాలి'

PDPL: ధర్మారం మండలం నంది మేడారం 30 పడకల సామాజిక ఆసుపత్రిలో రోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఓపీ సేవలు మాత్రమే కొనసాగుతున్నయని రోగులు ఆరోపిస్తున్నారు. దీంతో పూర్తిస్థాయి సేవలు అందడం లేదని, ఫలితంగా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రజల సౌకర్యార్థం పూర్తిస్థాయిలో ఇన్‌పేషెంట్ వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.