NZB: సిరికొండ మండలం కొండాపూర్‌లోని బాలాజీ రైస్ మిల్లుపై మంగళవారం రాత్రి పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు 282 క్వింటాళ్ల రేషన్ బియ్యం జప్తు చేసినట్లు సీఐ భిక్షపతి తెలిపారు. బాలాజీ రైస్ మిల్లు యజమాని భాస్కర్, శ్రీసాయి రైస్ మిల్లు యజమాని సాయికుమార్ ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
తెలంగాణ
282 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత: సీఐ


