హైదరాబాద్: 28°C
తెలంగాణ

షార్ట్ సర్క్యూట్.. రూ.3లక్షల మేర ఆస్తి నష్టం

MNCL: జైపూర్ మండలం ఇందారం గ్రామంలో 11కేవీ విద్యుత్ వైర్ తెగి సర్వీస్ వైర్‌పై పడటంతో ఇళ్లల్లోకి విద్యుత్ ప్రవహించి షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఇళ్లలో టీవీ, ఫ్రిడ్జ్, తదితర గృహప్రకారణాలు దెబ్బతిన్నాయి. సుమారుగా రూ.3లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న సర్పంచ్ ఫయాజ్ బాధిత కుటుంబాలతో మాట్లడారు.