ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని పంగులూరువారిపాలెం గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి సమయంలో గ్రామంలోని రాముల వారి ఆలయంలో చొరబడి హుండీలు పగలగొట్టి నగదు దోచుకెళ్లారు. ఉదయాన్నే గ్రామస్తులు దొంగతనం జరిగిందన్న విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు విచారిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రామాలయంలో చోరీ!


