కోనసీమ: అయినవిల్లి నుంచి ముమ్మిడివరం వెళ్లే మార్గంలో శానపల్లిలంక గరువు వద్ద రోడ్డు అద్వానంగా మారింది. 50 మీటర్ల మేర రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా కాలం నుంచి రోడ్డు పరిస్థితి ఇదే విధంగా ఉన్నా.. పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడైపోయిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
అద్వాన్నంగా మారిన శానపల్లిలంక రోడ్డు


