హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓవర్‌లోడ్‌ లారీతో తప్పిన పెను ప్రమాదం

ASR: అనంతగిరి ఘాట్‌రోడ్డులో ఓవర్‌లోడ్‌ వాహనాల రాకపోకలతో ప్రమాదాలు కొనసాగుతున్నాయి. డముకు వద్ద ఐదో మలుపులో భారీ ఐరన్‌ లోడుతో వెళ్తున్న టిప్పర్‌ ముందు భాగం పైకి లేచింది. దీంతో ఇనుపచువ్వలు వెనక్కి జారి రోడ్డును తాకడంతో లారీ నిలిచిపోయి పెను ప్రమాదం తప్పింది. పది రోజుల ఆరో మలుపు వద్ద ఓవర్‌లోడ్‌ లారీ బోల్తాపడిన ఘటన చోటుచేసుకుంది.