శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ విజయం దిశగా సాగుతోంది. 372 పరుగుల లక్ష్య ఛేదనలో లంక నాలుగో రోజు ఆటముగిసే సమయానికి 4 వికెట్లకు 84 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 288 పరుగులు కావాలి, చేతిలో 6 వికెట్లున్నాయి. చివరి రోజు కావడంతో భారత గెలుపుపై ఉత్కంఠ నెలకొంది. అయితే వాతావరణం, వర్షం మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.
క్రీడలు
విజయానికి చేరువలో భారత్.. వర్షం పడితే..?


