హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్చూరులో కొనసాగుతున్న రైతుల నిరసన దీక్ష

BPT: గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష పర్చూరు బొమ్మల సెంటర్‌లో కొనసాగుతోంది. మంగళవారం ఇన్ కొల్లు, గర్నెపూడి గ్రామాలకు చెందిన రైతులు ఈ దీక్షలో పాల్గొన్నారు. అనంతరం పర్చూరు ఎమ్మార్వో పి. బ్రహ్మయ్యను కలసి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు.