హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు భూ నిర్వాసితుల రిలే నిరసన దీక్ష

SRD : జిన్నారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 1లోని 421 ఎకరాల భూమికి సంబంధించిన భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలని కోరుతూ నేడు రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు నిర్వాసిత రైతులు తెలిపారు. ఈ దీక్షకు వివిధ పార్టీల నాయకులు, జిన్నారం గ్రామ ప్రజలు హాజరై రైతులకు మద్దతుగా నిలిచి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.