హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాము కాటుతో వ్యవసాయ కూలీ మృతి

MHBD: పత్తి చేనులో కలుపు తీస్తుండగా పాము కాటుకు గురై వ్యవసాయ కూలీ మక్కల రాములమ్మ (65) మృతి చెందారు. మరిపెడ మండలం బాల్నిధర్మారం గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. చికిత్స కోసం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా మంగళవారం మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గండ్రాతి సతీష్ తెలిపారు.