హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాలలో జోనల్ టైక్వాండో పోటీలు

నంద్యాల పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 22, 23న జోనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టైక్వాండో ఛాంపియన్‌షిప్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు హర్ష వర్ధన్ తెలిపారు. ఆరు జిల్లాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. పోటీల పోస్టర్‌ను గోళ్ల రాజేష్ ఆవిష్కరించారు. ఆయనను జిల్లా టైక్వాండో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా, సలహాదారుగా ఎన్నుకున్నారు.