ELR: ఉంగుటూరు మండలం ఉప్పాకపాడులో ప్రధాన రోడ్డుపైనే చెత్తను డంప్ చేయడం వల్ల గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే పంచాయతీ వారు చెత్తను పోస్తుండడంతో రోడ్డు అంతా దుర్వాసనతో నిండిపోతోంది. వర్షం పడినప్పుడు మురుగునీరు రోడ్డుపైకి చేరి వాహనదారులు, బడికి వెళ్లే పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉప్పాకపాడులో రోడ్డుపైనే డంపింగ్ యార్డ్


