హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ ఇదే

వరంగల్ పట్టణంలోని భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. శ్రావణమాస వేడుకల్లో భాగంగా నేడు మొదటి బుధవారం పురస్కరించుకొని అర్చకులు తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి అమ్మవారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి, విశేష పూజలు నిర్వహించి, హారతి ఇచ్చారు. ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు.