హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రంథాలయాన్ని సందర్శించిన మంత్రి, ఎంపీ

భద్రాద్రి జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ మంగళవారం సందర్శించారు. గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న వసతులపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.