హైదరాబాద్: 28°C
క్రీడలు

ESPN వ్యవస్థాపకుడు మృతి

ESPN వ్యవస్థాపకుడు, క్రీడా ప్రసార రంగాన్ని మార్చిన బిల్ రాస్ముసెన్ (93) కన్నుమూశాడు. కొడుకు స్కాట్‌తో కలిసి 1970లలో 24 గంటల క్రీడా ఛానెల్ ఆలోచనకు రూపకల్పన చేసి, 1979 సెప్టెంబర్ 7న ESPN ప్రసారాలను ప్రారంభించాడు. ఈ సాహసోపేత నిర్ణయం అద్భుత విజయవంతమై, ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రసార రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది.