హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిక్షణ డిప్యూటీ తహసీల్దారు ఆత్మహత్య.. ముగ్గురిపై కేసు

మహబూబాబాద్ పట్టణంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో మనస్తాపానికి గురైన శిక్షణ డిప్యూటీ తహసీల్దారు డోలి సంధ్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్యామ్‌ అనే యువకుడు పెళ్లికి నిరాకరించడంతో పాటు అతని తల్లిదండ్రులు బెదిరింపులకు పాల్పడ్డారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో మంగళవారం శ్యామ్‌, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు సిఐ రఘుపతిరెడ్డి తెలిపారు.