హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి కుంట పనులను ప్రారంభించిన జడ్పీ సీఈవో

PDPL: రామగిరి మండలంలోని రత్నాపూర్ గ్రామంలో నీటికుంట తవ్వకం పనులను మంగళవారం జెడ్పి డిప్యూటీ సీఈవో సంజీవరావు ప్రారంభించారు. పొలాల్లో నీటి కుంటల ఏర్పాటుతో సాగునీటి సమస్యను అధిగమించవచ్చని రైతులకు సూచించారు. నీటికుంటల ఏర్పాటుకు ముందుకు వచ్చే రైతులకు వీబీజీ రామ్ జీ పథకం కింద ప్రోత్సాహం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శైలజరాణి, సర్పంచ్ పల్లె ప్రతిమ పాల్గొన్నారు.