హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేరాల నియంత్రణపై పోలీసుల సమీక్ష

KNR: జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో జూలై నెల నేర సమీక్ష సమావేశం సీపీ గౌస్ ఆలం అధ్యక్షతన నిర్వహించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు, మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాలు, డ్రగ్స్, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులతో చర్చించారు. నేరాల దర్యాప్తులో ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ ఆధారాలను వినియోగించి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సీపీ సూచించారు.