NZB: బాల్కొండ మండల కేంద్రంలోని అగ్నిమాపక కార్యాలయంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫైర్ సేఫ్టీ అధికారి బి. శేఖర్ అగ్ని ప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే 101 లేదా 112కు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం


