హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లాలో బీజేపీ ఎండోమెంట్ సెల్ విస్తరణ

MDK: జిల్లా BJP కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రాధామల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎండోమెంట్ సెల్ నియామక కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఎండోమెంట్ సెల్ కన్వీనర్ సూర్య ప్రకాష్, కో-కన్వీనర్ నిరంజన్ దేశాయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లాలోని నియోజకవర్గాలు, డివిజన్లు, వార్డుల నుంచి కార్యకర్తలను నియమించారు. ఆలయాల సమస్యల పరిష్కారం, ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలని నాయకులు సూచించారు.