హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జలసిరి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

KMR: రైతులు జలసిరి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా డీఆర్డీవో దామోదర్‌రెడ్డి సూచించారు. మంగళవారం గాంధారి మండలం సోమ్లానాయక్ తండాలో నిర్మిస్తున్న ఫార్మ్ పాండ్లను పరిశీలించారు. భూగర్భజలాలను పెంపొందించేందుకు రైతులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు.