MLG: విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంకోసం బుధవారం హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధఎదుట నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని ములుగు జిల్లా ఛైర్మన్ కన్నూరిరంగారావు, సెక్రెటరీ జనరల్ గుర్రంఉదయ భాస్కర్ పిలుపునిచ్చారు. మంగళవారం ములుగు డీఈ కార్యాలయం ఎదుటవాల్ పోస్టర్లు విడుదల చేశారు. పీఆర్సీ, ఖాళీపోస్టుల భర్తీ, ప్రమోషన్లు, ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలన్నారు.
తెలంగాణ
'మహా ధర్నాను విజయవంతం చేయండి'


