హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రి నేతలతో నేడు జగన్ సమావేశం

E.G: రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన నేతలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు, పార్టీ సంస్థాగత అంశాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై జగన్ వారితో చర్చించనున్నారు.