హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీలకు 34% రిజర్వేషన్లపై చంద్రబాబుకు ధన్యవాదాలు

GNTR:స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు బీసీ ప్రజాప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం శాసనసభలో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీల రాజకీయ సాధికారతకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దోహదపడుతుందని వారు పేర్కొన్నారు.