NGKL: నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం గ్రామంలో భక్తీశ్రద్ధలతో మంగళవారం రాత్రి ఘనంగా పోచమ్మ దేవత బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కొత్త కుండలో బోనం చేసి పోచమ్మ దేవతకు నైవేద్యాన్ని సమర్పించి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామ ప్రజలను, పాడిపంటలను చల్లగా కాపాడాలని అమ్మవారిని వేడుకున్నట్లు వారు తెలిపారు.
తెలంగాణ
పోచమ్మ దేవతకు భక్తిశ్రద్ధలతో బోనాలు


