హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ నంబర్ ప్లేట్ బైక్ పట్టివేత.. ఇద్దరి అరెస్ట్

ADB: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చౌక్ వద్ద వాహన తనిఖీల్లో నకిలీ నంబర్ ప్లేట్‌తో ఉన్న పల్సర్ బైక్‌ను వన్‌టౌన్ పోలీసులు పట్టుకున్నట్లు CI సునీల్ కుమార్ మంగళవారం తెలిపారు. నిందితులు నాలుగు నెలల క్రితం రూ.21 వేలకు తాకట్టు పెట్టినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై నిందితులు షేక్ అర్బాస్, కృష్ణపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు CI సునీల్ కుమార్ పేర్కొన్నారు.