హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ సదస్సు కరపత్రం ఆవిష్కరణ'

NLG: మిర్యాలగూడ పట్టణంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఆగస్టు 29న జరగనున్న ఆవిర్భావ సదస్సు కరపత్రాన్ని మంగళవారం ఆవిష్కరించారు. సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధన కోసం నిర్వహిస్తున్న ఈ సదస్సుకు జేఏసీ చైర్మన్ డా. విశారదన్ మహరాజ్ హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. నియోజకవర్గంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు సదస్సులో పాల్గొనాలని కోరారు.