హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎంని కలిసిన ఎమ్మెల్యే విజయశ్రీ

TPT: సూళ్లూరుపేట ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని కాళంగి బ్రిడ్జి, కొరిడి-పెర్నాడు, వేనాడు రోడ్ల అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఆయా పనులకు అవసరమైన నిధులు మంజూరు చేసి, త్వరితగతిన పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.