MNCL: సీసీసీ నస్పూర్‌లోని భరోసా కేంద్రాన్ని మంగళవారం మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా భరోసా కేంద్రం పరిసరాలు, బాధితులకు అందుతున్న సేవలను పరిశీలించి, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కేంద్రాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి బాధితుడి సమస్యలను తెలుసుకుని సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణ
భరోసా కేంద్రాన్ని సందర్శించిన డీసీపీ


