హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలి'

ASR: పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం యాంటీ ర్యాగింగ్ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సత్ప్రవర్తన ఆత్మానందాన్ని కలిగిస్తుందని, దుష్ప్రవర్తన భవిష్యత్తులో దుష్ప్రభావాలకు దారితీస్తుందని ప్రిన్సిపాల్ డా.సత్యనారాయణ విద్యార్థులకు వివరించారు. ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలన్నారు.