ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఇందాని గ్రామంలో CSR నిధులు రూ.25 లక్షలతో నిర్మించనున్న ఆరోగ్య ఉపకేంద్రానికి కలెక్టర్ హరిత మంగళవారం భూమిపూజ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపకేంద్రంతో పరిసర గ్రామాల ప్రజలకు ప్రాథమిక వైద్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలను బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు.
తెలంగాణ
'మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలను బలోపేతమే లక్ష్యం'


