హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజన్న ఆలయ అభివృద్ధికి విరాళం

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనులకు మల్కాజ్‌గిరికి చెందిన ఖమ్మంపాటి శ్యామల–శ్రీకాంత్ దంపతులు రూ.1 లక్ష విరాళంగా అందించారు. చెక్కును దేవస్థానం పీఆర్‌ఓ పెరుక శ్రీనివాస్‌కు అందజేశారు. అనంతరం దంపతులు భీమేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి ఆశీర్వచనాలు చేశారు.