హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్మారెడ్డి పాఠశాలకు గ్రామస్తుల చేయూత

KMR: మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో ఎంపీపీఎస్ పాఠశాలకు మరమ్మతు పనులు చేపట్టినట్లు సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ తెలిపారు. పనుల్లో భాగంగా గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పాఠశాలకు పెయింటింగ్ వేశారు. బడిని దేవాలయంగా భావించాలని, ‘మన గ్రామం–మన బడి’ నినాదంతో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడమే లక్ష్యమన్నారు.