KNR: జమ్మికుంట పట్టణంలో ఆహార భద్రత శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. కొండూరు కాంప్లెక్స్‌లోని కిరాణా హోల్‌సేల్ దుకాణాలు, గ్రెయిన్ మార్కెట్ రోడ్డులోని ఆయిల్ మిల్లులను పరిశీలించారు. అనుమానాస్పదంగా ఉన్న వేరుశెనగ నూనె, శనగపప్పు, వేరుశెనగలు, మిఠాయి ఉత్పత్తుల నమూనాలను సేకరించారు. వీటిని ప్రయోగశాలకు పంపించి, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
తెలంగాణ
జమ్మికుంటలో ఆహార భద్రత అధికారుల తనిఖీలు


