హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెగా డీఎస్సీపై ఢిల్లీ మంత్రి ప్రశంసలు

GNTR: డీఎస్సీ నిర్వహణపై మంత్రి లోకేష్‌కు ఢిల్లీ మంత్రి సర్దార్ మన్ జిందర్ సింగ్ శిర్సా అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో మెగా డీఎస్సీ అద్భుతమని కొనియాడారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా 16 వేలకు పైగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టడం అభినందనీయమన్నారు. అయితే, త్వరలోనే మరో 3 వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు లోకేష్ ఢిల్లీ మంత్రికి వివరించారు.