హైదరాబాద్: 28°C
వార్తలు

విశాఖలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సెప్టెంబర్ 3 నుంచి 20 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. రాత పరీక్షలో అర్హత సాధించిన 10,355 మంది అభ్యర్థులు ఇందులో పాల్గొననున్నారు. భారత సైన్యంలో చేరాలనుకునే యువతకు ఇది మంచి అవకాశమని అధికారులు తెలిపారు. ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామని వెల్లడించారు.