హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లిమర్ల అభివృద్ధికి సీఎం అండ

VZM: నెల్లిమర్ల నియోజకవర్గ అభివృద్ధికి మరింత వేగం తీసుకురావడమే లక్ష్యంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజా సంక్షేమం, అభివృద్ధి, మౌలిక వసతులు, పెండింగ్ సమస్యలు సహా పలు కీలక అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.