హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలికోట సూరమ్మ ప్రాజెక్టుకు మరో రూ.35.50 కోట్లు

JGL: కలికోట సూరమ్మ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం మూడో విడతగా రూ.35.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీంతో మూడు విడతల్లో ఇప్పటివరకు మొత్తం రూ.80 కోట్లు విడుదలయ్యాయి. నిధులు జగిత్యాల జిల్లా కలెక్టర్ ఖాతాలో జమయ్యాయి. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృషితో నిధులు మంజూరయ్యాయని తెలిపారు.