హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేను కలిసిన ఇల్లంతకుంట ప్రజాప్రతినిధులు

KNR: మానకొండూర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను ఇల్లంతకుంట మండల ప్రజాప్రతినిధులు, సర్పంచులు కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. మిడ్ మానేరు, అన్నపూర్ణ ప్రాజెక్టుల నుంచి సాగునీరు విడుదల చేయాలని కోరారు. రహదారులు, బ్రిడ్జిల నిర్మాణంతో పాటు 11వ ప్యాకేజీ కాలువ ద్వారా ఎర్రకుంటను నింపాలని విజ్ఞప్తి చేశారు.