RR: నాగోల్ బ్రిడ్జి నుంచి ఎల్‌బీనగర్ జంక్షన్ వరకు రహదారిపై గుంతలు, దెబ్బతిన్న ప్రాంతాలను బీటీ ప్యాచ్‌వర్క్‌తో మరమ్మతు చేస్తున్నారు. ఎస్‌ఈ, ఏఈ, ఎల్‌బీనగర్ ట్రాఫిక్ పోలీసులు పనులను పరిశీలించారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా, రహదారి భద్రతను మెరుగుపరిచేలా పనులను త్వరగా, సమర్థవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
గుంతలకు బీటీ ప్యాచ్‌వర్క్


