హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

VSP: బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశం-2026 నేపథ్యంలో విదేశీ ప్రతినిధుల పర్యటన కోసం చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రుషికొండ బీచ్, తొట్లకొండ బౌద్ధారామం, కంబాలకొండ అభయారణ్యంలో పర్యటించారు. పరిశుభ్రత, భద్రత, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.