హైదరాబాద్: 28°C
తెలంగాణ

TOSS ప్రచార పోస్టర్‌ ఆవిష్కరణ

MDK: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) SSC, ఇంటర్మీడియట్ ప్రవేశాల ప్రచార పోస్టర్‌ను మెదక్ DEO S.రాజు ఆవిష్కరించారు. చదువు మధ్యలో ఆపేసిన వారు, ఉద్యోగులు, గృహిణులకు టాస్ మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. అర్హులైన వారు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ వరప్రసాద్, కరుణాకర్ పాల్గొన్నారు.