హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కళాశాల సమస్యల పరిష్కారానికి వినతి'

KMR: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదులు నిర్మించి, మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి విద్యార్థి సంఘాలు వినతిపత్రం అందజేశాయి. కళాశాలలో వెయ్యికి పైగా విద్యార్థులు చదువుకున్నప్పటికీ సరిపడా తరగతి గదులు, డెస్కులు, టాయిలెట్లు, ప్రహరీ గోడ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘాల నాయకులు తెలిపారు.